యంగ్ రెబెల్ స్టార్ 'ప్రభాస్' నటిస్తున్న తాజా చిత్రం మిర్చి ఆఖరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. రచయిత కొరటాల శివ ఈ చిత్రానికి దర్సకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా పవర్ ఫుల్ పంచ్ డైలాగు లతో ప్రభాస్ అభిమానుల్ని,మాస్ ప్రేక్షకులని అలరిస్తుందని సమాచారం. మిర్చి ఆడియో ను వచ్చే నెల 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభాస్ సరసన అనుష్క , రిచా గంగోపద్యాయ లు హీరోయిన్ లుగా నటిస్తుండగా ప్రమోద్ ఉప్పలపాటి ,వంశి కృష్ణ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఈ సినిమా కి అనుష్క స్వతహాగా డబ్బింగ్ చెప్పుకోనుందని సమాచారం.ఈ సినిమా ని వచ్చే ఫిబ్రవరి లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment