Friday, December 28, 2012

సమంత కి "లవరు"న్నాడట

సమంత. ఏ మాయ చేసావే సినిమా తో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టిన ఈ అందాల సుందరి ఇపుడు  స్క్రీన్ మీద కనపడగానే వచ్చే రెస్పాన్స్ ఆ సినిమా లో నటించే హీరో ల కంటే ఎక్కువగానే ఉంటుంది అంటే ఆమెకి ఉన్న  క్రేజ్ ఏమిటో అర్ధమౌతుంది. సినిమా ఇండస్ట్రీ లో ఉన్నపుడు రూమర్స్ కూడా నాయికల చుట్టూ తిరగుతూనే ఉంటాయి.


అయితే సమంత అలాంటి వాటికీ చెక్ పెడుతూ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తను ఒకరితో ప్రేమలో ఉన్న విషయాన్నీ చెప్పకుండానే చెప్పేసింది.అన్ని సక్రమంగా జరుగుతున్నాయని,ఫస్ట్ కెరీర్ మీద మాత్రమే ద్రుష్టి పెడుతున్నానని చెప్పింది.అంతే కాదు వాళ్ళిద్దరూ గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నామని ఇపుడే అతని పేరు వెల్లడించడం ఇష్టం లేదని చెప్పడంతో మళ్లి రూమర్స్ మొదలిపోయాయి.అతను ఒక టాలీవుడ్ దర్శకుడనే వార్త ఇపుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది.ఇంతకి అసలా లక్కీ ఫెలో ఎవరో వేచి చూడాల్సిందే .


No comments:

Post a Comment