Thursday, December 27, 2012

సంక్రాంతి కానుకగా 'చమ్మక్ చల్లో'


వరుణ్ సందేశ్, సంచితా పదుకొనె ,కేథరిన్ లు హీరో హీరోయిన్ లుగా శ్రీ శైలేంద్ర మూవీస్ పథకం ఫై మాస్టర్ బుజ్జి బాబు నిర్మిస్తున్న చిత్రం "చమ్మక్ చల్లో" . డి . ఎస్ .రావు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా జాతీయ అవార్డు గ్రహీత నీలకంట దర్సకత్వం వహిస్తున్నారు.


దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా యువత మనోభావాలకు దగ్గరగా ఉండే విధంగా కళాశాల నేపద్యంలో సాగే ప్రేమ కథ చిత్రం గా రూపొందిస్తున్నాం అన్నారు.ఈ సినిమా కథను ఒక కొత్త ప్రేమ కథ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.హీరో తండ్రి గా బ్రహ్మాజీ నటిస్తుండగా అవసరాల శ్రీనివాస్ ,షాయాజీ షిండే ,వెన్నెల కిషోర్,సురేఖా వాణి,చిన్మయి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .  అనంత శ్రీ రామ్ ఈ చిత్రం లోని పాటలు వ్రాయగా కిరణ్ వారణాసి సంగీతాన్ని అందించారు.

చమ్మక్ చల్లో షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా ఈ సినిమా ని వచ్చే నెలలో సంక్రాంతి కనుక గా విడుదల చేయనున్నారు.


No comments:

Post a Comment