Showing posts with label anushka. Show all posts
Showing posts with label anushka. Show all posts

Thursday, December 27, 2012

ఆఖరి దశ షూటింగ్ లో ప్రభాస్ 'మిర్చి'


యంగ్ రెబెల్ స్టార్ 'ప్రభాస్' నటిస్తున్న తాజా చిత్రం మిర్చి ఆఖరి దశ  షూటింగ్ జరుపుకుంటుంది. రచయిత కొరటాల శివ ఈ చిత్రానికి దర్సకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా పవర్ ఫుల్ పంచ్ డైలాగు లతో ప్రభాస్ అభిమానుల్ని,మాస్ ప్రేక్షకులని  అలరిస్తుందని సమాచారం. మిర్చి ఆడియో ను వచ్చే నెల 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ప్రభాస్ సరసన అనుష్క , రిచా గంగోపద్యాయ లు హీరోయిన్ లుగా నటిస్తుండగా ప్రమోద్ ఉప్పలపాటి ,వంశి కృష్ణ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఈ సినిమా కి  అనుష్క స్వతహాగా డబ్బింగ్ చెప్పుకోనుందని సమాచారం.ఈ సినిమా ని వచ్చే ఫిబ్రవరి లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.