యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'బాద్షా' లో బిజీ గ ఉన్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కి నిర్మాత బండ్ల గణేష్ బాబు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది .
ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిచగా శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ ఫై బండ్ల శివ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
బాద్షా పూర్తి కాగానే ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్సకత్వంలో ఒక సినిమా లో నటించనున్నాడు.ఈ సినిమా కి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.ఇపుడు ఎన్టీఆర్ తరువాత సినిమా కూడా సెట్స్ లోకి వెళ్లనుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.సంతోష్ శ్రీనివాస్ దర్సకత్వంలో బెల్లంకొండ సురేష్ ఈ చిత్రన్ని నిర్మించనున్నారట.అంతే కాకుండా ఈ సినిమాకి "రభస" అనే టైటిల్ కూడా ఖరారు చేసారని, అది కూడా హరీష్ తో సినిమా షూటింగ్ పూర్తవకుండానే ఈ సినిమా కూడా సెట్స్ మీదకి వెల్లనుందని టాక్.
No comments:
Post a Comment