రామ్ చరణ్ ద్విపాత్రాభినయం లో కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ నటించిన సినిమా నాయక్ . క్రియేటివ్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్సకత్వం వహించగా డి.వి.వి.దానయ్య ఈ సినిమాని నిర్మించారు.
కథ :
చరణ్ అలియాస్ చెర్రీ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ,వరుసకు మావయ్య అయిన బ్రహ్మానందం అలియాస్ జిలేబి లోకల్ రౌడీ ఐన గండిపేట బాబ్జి రాహుల్ దేవ్ తో ప్రొబ్లెమ్స్ లో ఉంటాడు. జిలేబి ని కాపాడే ప్రయత్నం లో బాబ్జి చెల్లెలు ఐన కాజల్ (మధు )తో ప్రేమ లో పడతాడు చెర్రీ . ఈ క్రమంలో హైదరాబాద్ ,కోల్ కాతా లలో వరుస హత్యలు జరగడంతో దానిలో ఇరుక్కుంటాడు చెర్రీ.చెర్రీ ని పట్టుకోడానికి ఆశిష్ విద్యార్ధి తో కూడిన ఒక సిబిఐ టీం వెతుకుతూ ఉంటుంది.ఇక్కడ నుంచి కథలో ఒక కొత్త ట్విస్ట్ మొదలవుతుంది.చరణ్ ఆ సిబిఐ నుంచి ఎలా ఎస్కేప్ అయ్యాడు?అమలా పాల్ ఎవరు ?కోల్ కత్తా లో ఏమి జరిగింది అనేది మిగిలిన కథ.
ప్రతిభ :
మెగా స్టార్ తనయుడిగా మంచి క్రేజ్ ని ఫాన్స్ ని సంపాదించుకున్న చరణ్ ఈ సినిమా తో మరోసారి తండ్రి పేరు నిలబెట్టాడు.చరణ్ ఈ సినిమాలో చాలా అద్బుతం గ చేసాడు అనడం అతిశయోక్తి కాదు.మునుపటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమా డైలాగ్స్ లో వాయిస్ ని సమయానుకూలం గా మార్చుకుని చాలా వరకు మెరుగయ్యాడు అని చెప్పొచ్చు.డాన్సుల్లోను తన ప్రతిభ చాటుకున్నాడు.కాజల్ అగర్వాల్ చరణ్ ల కాంబినేషన్ చాల బాగుంది.అమల పాల్ పాత్రకి అంత ఇంపార్టెన్స్ లేదు కాని ఆమె నటించిన రెండు పాటలలోనూ ,కనిపించిన కొన్ని సీన్ లలోనూ ఆమె బాగానే నటించింది.జిలేబి పాత్రలో నటించిన బ్రహ్మిమరోసారి తన కామెడి ప్రతాపం చూపించాడు.కోల్ కతా క్రిమినల్ గా నటించిన పోసాని కృష్ణ మురళి పాత్ర కూడా చాల బాగుంది.ఎమ్.ఎస్.నారాయణ సిబిఐ లో తాగుబోతు లిప్ రీడింగ్ ఆఫీసర్ గా నవ్వులు కురిపించాడు.జయ ప్రకాష్ రెడ్డి రాహుల్ దేవ్ పెదనాన్న పాత్రలో నటించాడు.
సాంకేతిక వర్గం :
మాస్ ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు వినాయక్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. స్క్రీన్ ప్లే కొంచెం డల్ గా ఉన్న కామెడీ సీన్ లను ఉపయోగించి ఎక్కడ ప్రేక్షకుడికి బోర్ ఫీల్ అవకుండా సినిమా ని చక్కని దర్సకత్వం తో తెరకెక్కించాడు.అక్కడక్కడా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు పేలవంగా వచ్చాయి.ఈ సినిమా కి చోట కె నాయుడు ఫోటోగ్రఫీ ఒక పెద్ద ప్లస్, ముఖ్యంగా రెండు పాటలలో చిత్రీకరణ హైలైట్ గా నిలుస్తాయి. ఆకుల శివ అందించిన కథ మాటలు ముఖ్యంగా కామెడి సీన్ లలో వచ్చే డైలాగ్స్ చాల బాగున్నాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.ఇక తమన్ సమకూర్చిన స్వరాలుకు ఆడియో విడుదల నుంచి మంచి స్పందనే వచ్చింది, సినిమా లో అవి కూడా ఒక ప్లస్ గానే చెప్పొచ్చు. ఫస్ట్ ఫైట్ చాల బాగా కంపోస్ చేసారు మిగతావన్ని చెప్పుకోతగిన కొత్తగా ఏమి లేవు.ఆనంద్ సాయి వేసిన సెట్ లు బాగానే ఉన్నాయి.
ప్లస్ :
రామ్ చరణ్ డాన్సు లు ఫైట్ లు చాల బాగున్నాయి . కామెడీ కూడా చాల వరకు కొత్తగా, ఎంజాయ్ చేసేలా ఉంది.
పాటలు కూడా ఈ సినిమా కి ఒక హైలైట్.
మైనస్ :
సత్తువ లేని కథ ,కథనం.అంతగా ఉపయోగించని వినాయక్ ప్రతిభ,క్లైమాక్స్ .
రేటింగ్ : 3.75/5
ఆఖరి మాట :
గ్రాఫిక్స్ తో కూడిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు,పేలవమైన కథ అయినప్పటికీ, పాటలలో ఫైట్ లలో రామ్ చరణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ , ఈనాటి ప్రేక్షకుడు కోరుకొనే కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎక్కడ బోర్ కొట్టని సన్నివేశాలు వాటిని మర్చి పోయేలా చేస్తాయి. సంక్రాంతి కానుక గా రిలీజ్ అయిన ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు.